- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన చేసిన సినిమా కోసం ఇప్పటికీ తెగ వెతుకుతున్నాను.. అక్షయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏడాదిలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏడాదిలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల హౌస్‌ఫుల్, స్కై ఫోర్స్ వంటి మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అక్షయ్ భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మా నాన్నది అమృత్‌సర్ అయితే ఉద్యోగరిత్యా ముంబైకి షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యారు. అప్పుడు నాకు ఐదేళ్లు ఉండేవి. మా నాన్నకు సినిమా షూటింగ్ చూడటం చాలా నచ్చేది. ఓ చిత్రాన్ని షూట్ చేస్తున్న సమయంలో వెళ్లిన ఆయనను టీమ్ ఒక పాత్రలో నటిస్తావా? అని అడిగారట.
ఆ మూవీలో మా నాన్న శివుడిగా నటించారు. తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఆయన చేసిన ఒకే ఒక్క సినిమా కావడంతో దాని కోసం నేను ఇప్పటికీ వెతుకుతున్నాను. కానీ దొరకడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, కన్నప్ప చిత్రం మంచు విష్ణు (manchu vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. అయితే దీనిని మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్, మధుబాల, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా ద్వారా మంచు విష్ణు ముగ్గురు పిల్లలు అవ్రామ్, వివియానా, అరియానా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






