అలాంటి పాత్రలు చేయడానికి నేను సిద్ధమే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ (Vakeel Saab)సినిమాలతో నటిగా తన సత్తా చాటిన అనన్య నాగళ్ల(Ananya Nagalla)… స్టార్ స్టేటస్ దక్కకపోయినా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అలాంటి పాత్రలు చేయడానికి నేను సిద్ధమే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ (Vakeel Saab)సినిమాలతో నటిగా తన సత్తా చాటిన అనన్య నాగళ్ల(Ananya Nagalla)… స్టార్ స్టేటస్ దక్కకపోయినా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన ప్రతి ఛాన్స్‌ని తన కెరీర్‌కు మెట్టులా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. గత ఏడాది ‘పొట్టేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. పూర్తి ఫోకస్ సోషల్ మీడియాపై పెట్టిన అనన్య నిత్యం పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. అలాగే ఇంటర్వ్యూ్ల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. తాజాగా, అనన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

“బొంబాయి నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు త్వరగా వస్తాయి. కానీ లాంగ్ రేస్ ఆడాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే కరెక్ట్” అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితులు పూర్తిగా మారాయని అనన్య చెబుతోంది. “కమర్షియల్ హీరోయిన్ల రోల్స్ తక్కువైనా కెరీర్ మాత్రం సేఫ్‌గానే ఉంటుంది. నేను కేవలం హీరోయిన్ పాత్రలకే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాలనుకుంటున్నా” అని స్పష్టం చేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో నటించిన తర్వాత వెంటనే పెద్ద ఆఫర్లు వస్తాయని ఆశించినా అది జరగలేదని ఓపెన్‌గా చెప్పింది. “కొంత గ్యాప్ వచ్చింది.

కానీ ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి” అంటూ తన కెరీర్‌లో ఎదురైన రియాలిటీని బయటపెట్టింది. ఇక యాక్టర్‌గా మారాల్సిన తీరుపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. “నటుడు అంటే కేవలం ట్రెడిషనల్ పాత్రలే కాదు. అవసరమైతే గ్లామర్ కూడా చూపించాలి. అందుకే ఫోటోషూట్స్ చేశాను. అలాంటి పాత్రలు చేయడానికి కూడా నేను పూర్తిగా రెడీ” అంటూ అనన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story