ఆ హీరోయిన్ నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సొంత నిర్మాణ సంస్థపై వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్ 1చంద్ర’(Loka: Chapter 1Chandra).

ఆ హీరోయిన్ నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సొంత నిర్మాణ సంస్థపై వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్ 1చంద్ర’(Loka: Chapter 1Chandra). ఇందులో కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లీన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ కొత్త లోకా పేరుతో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా విజయం సాధించింది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో వెంకీ అట్లూరి పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘‘లోకా సినిమాను చూశా నాకు చాలా నచ్చింది. రూ.30కోట్లతో వచ్చి రూ.300 కోట్ల రేంజ్ తీశారని అందరూ అంటున్నారు. మలయాళ చిత్రం పరంగా రూ. 30 కోట్లు చాలా ఎక్కువ. దుల్కర్ సల్మాను‌ను అభినందించాలి. మలయాళంలో అందరూ గొప్పగా నటిస్తారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. ఆమె నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సీన్స్‌లో ఆమె చేసిన తీరుకి హ్యాట్సాఫ్. ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆగస్టులో నాగవంశీ ఓ సినిమా వల్ల మాట పడ్డాడు. అదే నెల చివర్లో హిట్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు. దటీజ్ నాగవంశీ’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story