Chiranjeevi: నీ 25 ఇయర్స్ జర్నీలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే.

Chiranjeevi: నీ 25 ఇయర్స్ జర్నీలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. తన 25 ఏళ్ల ప్రయాణాన్ని మెగాస్టార్ సమక్షంలో చేసుకోవడంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా చిరుతో ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా, ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘మై డియర్ శేఖర్ మీలాంటి అభిమానులు ఉండడం నాకూ ఆనందమే. మీ ప్రస్థానానికి నేను స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది.

సున్నితమైన వినోదంతో పాటు సందేశాన్ని జోడిస్తూ ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిల్మ్ మేకింగ్‌లో మీ కంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. మీరు ఇలాగే మరో 25 ఏళ్లు జనరంజకమైన సినిమాలు తీస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. అలాగే కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. కాగా, చిరు సినిమాల విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో నయనతార కూడా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతోపాటు మెగాస్టార్, వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’(Vishvambhara) సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.

Next Story