- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను విజయ్‌కి సలహాలిచ్చే స్థాయిలో లేను.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఇందులో పలు ప్రశ్నలు ఎదురవగా.. ఆయన సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా కొత్తగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రాబోతున్న విజయ్‌కి ఏమైనా సలహాలు ఇస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా సోదరుడు విజయ్(Vijay)కి సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కాదు. నేను ఆయనకు సలహాలిచ్చే స్థాయిలో లేను. అతనికి నాకు ఎంతో అనుభందం ఉంది. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు, మనుషులు పక్షపాంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు.
అనుభవమే అన్ని పాఠాలను నేర్పిస్తుంది’’ అని అన్నారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా విమర్శించకపోయినా, పరోక్షంగా విజయ్‌ని రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతుందో అప్రమత్రం చేసినట్లుగా అనిపిస్తుంది. అయినా కూడా విజయ్ ప్రతిష్టను దెబ్బతీయకుండా, విమర్శలు చేయకుండా, ఎంతో గౌరవంగా స్పందించడం కమల్ వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తులో నిలబెట్టింది. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది షాక్ అవుతూ కమల్ పరోక్షంగా విజయ్‌కి ‘పాలిటిక్స్ ఈజీ కాదు’ అని చెప్పారని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ‘‘ఇది పెద్దమనిషి చేసిన సాఫ్ట్ వార్నింగ్’’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
సినీ పరిశ్రమలో ఇద్దరూ పెద్ద స్టార్‌లు కావడంతో, రాజకీయ రంగంలో వారు ఎలా ముందుకు వెళ్తారనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ కొత్త పార్టీపై ప్రజలలో భారీ ఆసక్తి ఉండగా, కమల్ హాసన్ నుంచి వచ్చిన ఈ స్పందన రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘థగ్‌లైఫ్’ విజయం సాధించాడు. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. త్వరలోనే ఆయన రజినీకాంత్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






