- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్
ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు.. నా ఎదుగుదలకు, నమ్మకానికి, కన్నీళ్లకు, పట్టుదలకు నిదర్శనం.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)తన జీవితంలో ఒక అపురూపమైన మైలురాయిని చేరుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తూనే, మరోవైపు వైద్య విద్యను (MBBS) విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీల’గా మారిపోయింది. షూటింగ్ సెట్స్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు.. నా ఎదుగుదలకు, నమ్మకానికి, కన్నీళ్లకు, పట్టుదలకు నిదర్శనం. రంగుల ప్రపంచం (సినిమాలు) నుంచి నేను ప్రశాంతంగా తలదాచుకునే నా పవిత్రమైన ప్రదేశమే ఈ వైద్య విద్య. అక్కడ నేను కేవలం ఒక విద్యార్థిగా, నేనేలా ఉండాలనుకున్నానో అలా ఉండగలిగాను’’ అని శ్రీలీల భావోద్వేగానికి లోనయ్యారు.
అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు:
తను చదువుకుంటున్న సమయంలో పరీక్షల కోసం షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకుని, తనకు ఎంతో మద్దతుగా నిలిచిన నిర్మాతలకు, దర్శకులకు, తోటి నటీనటులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ‘‘నేను నన్ను నమ్మడం నేర్చుకుంటున్న సమయంలో.. నాకంటే ఎక్కువగా నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. ప్రతి చిరునవ్వు, ప్రతి ప్రోత్సాహం, మీరు నా కోసం చేసిన ప్రతి నిశ్శబ్ద ప్రార్థన నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఈ అధ్యాయం నన్ను ఎంతో వినయంగా, బలంగా మార్చింది. అందుకే, నన్ను నేను మీకు మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాను.. ప్రేమతో మీ డాక్టర్ శ్రీలీల’’ అని రాసుకొచ్చింది.






