చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. కుంగిపోతున్నానంటూ రష్మి ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన మాటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. కుంగిపోతున్నానంటూ రష్మి ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన మాటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా కమెడియన్ సుధీర్‌తో పలు షోల్లో పాల్గొని ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌‌ను దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు హాట్ ఫొటోలు షేర్ చేసి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. అలా వెండితెరకు కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మీ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. పలు షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘హలో ఆల్. ఇక నెల రోజులు డిజిటల్ డీటాక్స్ పాటించాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాను. అందులో సోషల్ మీడియా కూడా భాగమే. కొన్నిసార్లు అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ఇందులో అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక నాకు లేదు. ఒక విషయమైతే వాగ్దానం చేస్తున్నాను. కచ్చితంగా నేను మరింత దృఢంగా తిరిగి వస్తాను. నేను నా శక్తియుక్తులను పునరుద్దరించుకోవాలి.

ఎలాంటి డిజిటల్ ప్రభావం లేకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలనుకుంటున్నా. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నేను కుంగి పోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. నేను అందుబాటులో ఉన్నా లేకున్నా.. మీ ప్రేమ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటా? అని అయోమయంలో పడ్డారు.

Next Story