ఆయన చేసిన పని వల్లే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-03 12:10:06  IST  )

మంచు విష్ణు”(manchu vishnu) గత కొద్ది రోజుల నుంచి ‘కన్నప్ప’(Kannappa) సినిమా కోసం తెగ కష్టపడిపోతున్న విషయం తెలిసిందే.

ఆయన చేసిన పని వల్లే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: మంచు విష్ణు”(manchu vishnu) గత కొద్ది రోజుల నుంచి ‘కన్నప్ప’(Kannappa) సినిమా కోసం తెగ కష్టపడిపోతున్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌‌లోకి రాబోతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నా కన్నప్ప జర్నీ గురించి మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను.

మహాశివుడికి నేను పెద్ద అభిమానిని. ఆ భగవంతుడు కన్నప్పను పరీక్షించగా అతడు తన రెండు కళ్లను శివయ్యకు అర్పించాడు. తన జీవితాన్నే సమర్పించుకున్నాడు. అలా మర నిజజీవితాల్లో కూడా మనకోసం సర్వం ధారపోసేవాళ్లున్నారు. ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు. నా జీవితంలోనూ ఓ కన్నప్ప ఉన్నారు. ఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడి మాకు ఏ ఇబ్బందీ లేకుండా పెంచారు. ఈ రోజు నేను ఇంత మంచి పోజిషన్‌లో ఉన్నానంటే.. ఆయన చేసిన త్యాగ ఫలితమే. మా నాన్న నటుడిగా కష్టపడి నిలదొక్కుకోవడం వల్లే. ఆయనే నా హీరో. ఇలా మీ జీవితంలో ఉన్న కన్నప్ప గురించి చెప్పండి’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story