- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి వల్లే నేను ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నాను.. సాయి కుమార్ ఎమోషనల్ కామెంట్స్
చిరంజీవి గారు ఇచ్చినసపోర్ట్ వల్ల ‘పోలీస్ స్టోరీ’ చిత్రానికి తెలుగులో ఊహించని విధంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయని సాయికుమార్ గుర్తు చేసుకున్నారు.

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, తోటి నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైంది. తాజాగా నటుడు సాయికుమార్(Saikumar) ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1996వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో, సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ’ కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే గుర్తింపు ఉన్న సాయికుమార్, తన సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి గారిని సాయం కోరినట్లు తెలిపారు.మొదట చిరంజీవి గారు కొంత సంకోచించినా, నేను పట్టుబట్టడంతో ‘పోలీస్ స్టోరీ’ సినిమాను చూశారు. మూవీ చూశాక నా నటనకు ఫిదా అయిన మెగాస్టార్, వెంటనే ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో బైట్ ఇచ్చారు.
ఆయన లేకపోతే ఈరోజు నేను లేను
సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ డెబ్యూ సినిమా వస్తున్నా, పోటీలో ఉన్న మరో చిన్న చిత్రాన్ని, ఒక యువ నటుడిని ప్రోత్సహించాలనే చిరు నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచిందని అన్నారు. చిరంజీవి గారు ఇచ్చినసపోర్ట్ వల్ల ‘పోలీస్ స్టోరీ’ చిత్రానికి తెలుగులో ఊహించని విధంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయని సాయికుమార్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారు చేసిన ఆ సహాయం వల్లే తెలుగులో తనకు హీరోగా స్థిరమైన మార్కెట్ ఏర్పడిందని, ఆయన లేకపోతే ఈరోజు డైలాగ్ కింగ్ సాయికుమార్ లేరని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. కేవలం ప్రతిభను గుర్తించి, తన వారు-పరాయి వారు అనే భేదం లేకుండా ఎంకరేజ్ చేసే చిరంజీవి గారి గొప్ప మనసు వల్లే ఆయన ఇండస్ట్రీకి పెద్దన్న అయ్యారని అభిమానులు కొనియాడుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ విషయం బయటకు రావడంతో మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.






