- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ కోసమే హోంబలేలో మూడు సినిమాలు చేస్తున్నా.. నా ఫ్యామిలీ మెంబర్ అంటూ ప్రభాస్ కీలక వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. సోషల్ మీడియాకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం డార్లింగ్ కల్కి-2, స్పిరిట్, ఫౌజి, ది రాజాసాబ్(The Rajasaab) వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)బ్యానర్‌పై మూడు చిత్రాలు చేయడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజీఎఫ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన నాకు ఇంకా గుర్తుంది.
భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తుండగా.. అనుకోకుండా మంటలు అంటుకుని కాలిపోయింది. దీంతో అది చూసిన టీమ్ అంతా కంగారుపడిపోమారు. ఆసమయంలో విజయ్ కంగారు పడొద్దు డబ్బులు గురించి ఆలోచించొద్దు. అనుకున్నట్లుగానే సినిమాను పూర్తి చేయండి అని హామీ ఇచ్చారు. మేకింగ్ విషయంలో అస్సలు రాజీపడరు. అది నాకెంతో నచ్చింది. విజయ్ కిరంగందూర్(Vijay Kirangamdoor)తో పని చేసేవాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారు. అందరితో చాలా తొందరగా కలిసిపోతారు. ‘సలార్’తో మా జర్నీ స్టార్ట్ అయింది. మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం. ఆయన నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. అందుకే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






