ఇది ఖచ్చితంగా నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది: విష్ణు విశాల్

by Mallepaka Hamsa |

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’తో మంచి హిట్ అందుకున్న విష్ణు విశాల్ (Vishnu Vishal)ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఇది ఖచ్చితంగా నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది: విష్ణు విశాల్
X

దిశ, సినిమా: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’తో మంచి హిట్ అందుకున్న విష్ణు విశాల్ (Vishnu Vishal)ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలను లైన్‌లో పెట్టి బిజీ బిజీ షెడ్యూల్లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఇరందువానం’ (IranduVaanam )భారీ అంచనాల మధ్య రానుంది. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న లవర్స్ డే కానుకగా రాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్.. ఈ మూవీ గురించి పలు విషయాలు పంచుకున్నారు.

‘‘ఇరందు వానం సినిమా ముఖ్య కథను నేను చెప్పలేను. కానీ దాని గురించి కొన్ని విషయాలు పంచుకోగలను. ఇది ఒక ప్రేమకథ, ఇందులో అందరూ ఆశ్చర్యపోయే ఒక ప్రత్యేక అంశం ఉంది. నేను మొదట కథ విన్నప్పుడు, దర్శకుడు రామ్‌తో - ఇలాంటిది నిజంగా జరుగుతుందా? అని అన్నాను. రెండవ భాగంలో, లోతైన భావోద్వేగ క్షణం ఉంటుంది. మా 6 గంటల కథనం సమయంలో, రామ్ ఆ సన్నివేశాన్ని చెప్పినప్పుడు అతను కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇది ఖచ్చితంగా నా కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Next Story