స్క్రిప్ట్ వినకుండానే సినిమా ఒప్పుకున్నా.. ఆయనతో నటించడంతో నా కోరిక నెరవేరింది: రాశీ ఖన్నా

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-03 14:43:03  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar)కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.

స్క్రిప్ట్ వినకుండానే సినిమా ఒప్పుకున్నా.. ఆయనతో నటించడంతో నా కోరిక నెరవేరింది: రాశీ ఖన్నా
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar)కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా(Raashi Khanna) ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. ఇటీవల రాశీఖన్నా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ప్రకటించింది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీఖన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం హరీష్ శంకర్ నాకు కాల్ చేసినప్పుడు నేను కథ వినకుండానే ఓకే చేశాను. పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని చెప్పడంతో.. స్క్రిప్ట్ కూడా వద్దు అని చెప్పాను.

ఉస్తాద్ భగత్‌సింగ్ కేవలం పవన్ కోసమే చేశాను. చాలామందికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో సినిమా చేయాలనే డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండేది. నేను ఈ మూవీ చేయడంతో నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయింది. నేను పవన్ గురించి చాలా విన్నాను. ఆయన స్వాగ్ అనుకోకుండా ఉంది. నిజంగా పవన్‌తో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఆయనంటే చాలా ఇష్టం.. ఆయనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. ఆడియన్స్ అంటూ చాలా ఇష్టం. కొంతమందికి సినిమాలు అంటే పిచ్చి ఉంటుంది.. కానీ పవన్‌కి జనాలు అంటే పిచ్చి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story