- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా తీయడం విషయంలో నేను తప్పు చేశా అని ఒప్పుకుంటున్నా.. లింగుస్వామి ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ స్టార్ సూర్య(suriya), సమంత(samantha) జంటగా నటించిన ‘సికిందర్’ (Sikander)పెద్దగా మెప్పించలేకపోయింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య(suriya), సమంత(samantha) జంటగా నటించిన ‘సికిందర్’ (Sikander)పెద్దగా మెప్పించలేకపోయింది. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ కావడంతో పాటు పలు ట్రోల్స్ ఎదుర్కొంది. అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్ 28న రీరిలీజ్ కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లింగుస్వామి(Linguswamy) ‘సికిందర్’ తెరకెక్కించే విషయంలో తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు.
‘‘నేను ఈ సినిమా విషయం కొన్ని పొరపాట్లు చేశాను. కానీ మంచి చిత్రాన్ని ట్రోల్స్ ఆపలేవని నా నమ్మకం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిందించాలని చూస్తారు. అలాంటివారికి ఎవరూ సమాధానం చెప్పలేరు. వారు పెద్ద చిత్రాల్లో తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారు. నేను ఒకప్పుడు సాదాసీదాగా ఎడిట్ చేసి సినిమాను విడుదల చేశాను. కానీ ఇప్పుడు నేను భయపడటం లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే.. 30 నిమిషాల కంటెంట్‌ను తొలగించి రీఎడిట్ చేశాను. ఈసారి సూర్యపై మాత్రమే ఫోకస్ పెట్టాం. ప్రేక్షకులకు ‘సికిందర్’ రీరిలీజ్‌లో నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం.
అభిమానులు తీన్ని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా.. గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘సికిందర్’ కూడా రాబోతుండటంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఎన్ని చిత్రాలు ఇలా రీరిలీజ్‌లో బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘సికిందర్’రీ రిలీజ్‌లో దుమ్మురేపుతుందని అంతా అనుకుంటున్నారు.






