- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మా ఊరి పొలిమేర’లో ఆ సీన్ కోసం నగ్నంగా నటించాను: Satyam Rajesh
‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

దిశ, సినిమా: ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ కూడా తెరకెక్కింది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మూవీలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించారు. గౌరికృష్ణ నిర్మాతగా వ్యావహరించిన ఈ చిత్రం నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్ మీడియాతో ముచ్చటించాడు. ఇందులో తన పాత్ర గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.
రాజేష్ మాట్లాడుతూ ‘నా 20 ఏళ్ల సినీ కెరీర్లో ‘పొలిమేర 2’ మూవీ చాలా ప్రత్యేకమైంది. పొలిమేర 1కంటే పొలిమేర 2 బడ్జెట్ చాలా ఎక్కువ. కానీ ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇబ్బందే. ఎందుకంటే ఇందులోని హింసాత్మక, భయపెట్టే సీన్లు చాలా ఉన్నాయి. వాటిని ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేరు. అలాగే పొలిమేర 1లో అడల్ట్ కంటెంట్ ఇందులో లేదు. ఇక ‘పొలిమేర 3’ కూడా రావడం ఖాయం. ఈ మూవీ పొలిమేర 1కి ప్రీక్వెల్. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ సినిమాలో ఒక సీన్ కోసం నేను నగ్నంగా నటించాను. అది నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించిన తప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు సత్యం రాజేష్.






