తన లవర్‌ని పరిచయం చేసిన హైపర్ ఆది (వీడియో)

by Disha Web Desk |
తన లవర్‌ని పరిచయం చేసిన హైపర్ ఆది (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : తనదైన పంచ్‌ డైలాగులతో ట్రెండింగ్‌ కమెడియన్‌గా మారాడు హైపర్‌ ఆది. జబర్ధస్త్‌ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ షోలో మొదటగా కంటెస్టెంట్‌గా వచ్చి, తర్వాత టీమ్‌ లీడర్‌ అయ్యాడు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న పలు టీవీ షోలలో ఆది పాల్గొంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. పలు షోలలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.

తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్‌ కోసం చాలా మందికి లైన్‌ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక్క అమ్మాయిని మాత్రమే అని ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’ అని ఆది పిలవగా.. ఒక అమ్మాయి నవ్వులు చిందిస్తూ స్టేజ్‌ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్‌ యూ విహారిక’ అంటూ ప్రపోజ్‌ చేశాడు. విహారిక కూడా ‘లవ్‌ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైపర్‌ ఆది పెళ్లిపై గతంలో చాలా సార్లు రూమర్స్‌ వినిపించాయి. ఓ యాంకర్‌తో ఆది లవ్‌లో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఆ యాంకర్‌ వర్షిణితో పెళ్లి అనే పుకార్లు వినిపించగా.. ఆమె కొట్టిపారేసింది. అయితే ఆది మాత్రం ఈ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. పైగా తన పెళ్లిపై తానే పంచ్‌లు వేసుకుంటాడు. గతంలో కూడా తాను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే అంటూ పలు షోలలో కొంతమందిని పరిచయం చేశాడు. కాకపోతే అది స్కిట్‌లో భాగమే. కేవలం హైప్‌ కోసం ఆది అలా చెప్పేవాడు. ఇక తాజాగా ఆది పరిచయం చేసిన అమ్మాయి కూడా షోలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొంతమంది అయితే ఆ అమ్మాయిని ఏ టీవీ షోలోనూ చూడలేదు. నిజంగానే ఆమె ఆది లవర్ కావొచ్చునని అంటున్నారు.

మరి ఇందులో ఏది నిజమనేది తెలియాలంటే ఆ షో ఫుల్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయితేనే తెలుస్తుంది. అది షో కోసమా లేక నిజంగానే వాళ్ళిద్దరు త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారా అనేది ఫుల్ ఎపిసోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..!



Next Story