పెను ప్రమాదం నుంచి బయటపడిన స్టార్ హీరోయిన్ భర్త.. అసలేమైదంటే?

by Disha Web Desk 8 |
పెను ప్రమాదం నుంచి బయటపడిన స్టార్ హీరోయిన్ భర్త.. అసలేమైదంటే?
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీత చోప్రా భర్త పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ బ్యూటీ రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈయన కంటి సంబంధ వ్యాధితో బాధపడుతున్నారంట. గత కొన్ని రోజుల నుంచి ఈయన కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు రాఘవ్ చద్దా ఏమైపోయాడు అని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

అయితే ఆయన కంటి సంబంధ వ్యాధితో పోరాడుతున్నాడని, దీని వలన అతను లండన్ వెళ్లి కంటి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారని, ఒక వేళ ఆపరేషన్ ఆలస్యం అయితే ఆయన కటించి చూపు కోల్పోయే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాల వారు తెలిపారు. అంతే కాకుండా నటి పరిణీత కూడా తన భర్త వద్దే ఉందని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఆయన పెను ప్రమాదంలో చిక్కుకునే వారు.. సమయానికి చికిత్స తీసుకోవడం వల్లే ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటున్నారు పలువురు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక బాలీవుడ్ బ్యూటీ పరిణితకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2011లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, కిల్ దిల్, కేసరి, సైనా, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, డిష్యూం లాంటి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story