ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది.. హ్యూమా

by Disha Web Desk 7 |
ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది.. హ్యూమా
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ హ్యూమా ఖురేషి తనకు అత్యంత ఇష్టమైన పండగ దీపావళి అని చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంతకాలం బోసిపోయిన ఇండస్ట్రీ ఈ ఏడాది కలకలలాడుతుందని సంతోషం వ్యక్తం చేసింది. అలాగే ఈ దీపావళి అందరి జీవితాల్లో కాంతులు నింపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. గత రెండేళ్లుగా ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్‌లు ఇప్పుడు వరుసగా విడుదలవతున్నాయన్న ఆమె.. సినిమా షూటింగ్‌ల్లో వేగం పెరిగినందుకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుందని చెప్పింది.

ఇక సినిమా వ్యాపారం ఊపందుకుంటున్న సమయంలో ఈ పండుగ మరింత ఆనందం, ధైర్యం, భరోసానిస్తుందని పేర్కొంది. ఇక పండగ సంప్రదాయం ప్రకారం ప్రజలు ఆనందంగా లక్ష్మీ మాతను తమ ఇళ్లలోకి స్వాగతిస్తారని, కాబట్టి ఈ శుభ సందర్భంలో ముంబైలో తన స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలని ఎదురుచూస్తున్నట్లు చెబుతూ అందరికీ 'డబుల్ ధమాకా దీపావళి' శుభాకాంక్షలు తెలిపింది. కాగా హ్యూమా ఖురేషి, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'డబుల్ XL' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి :

ఆ ఒక్క సీన్ చూసి దేనికి పనికిరానన్నారు.. కన్నీరు పెట్టుకున్న Katrina Kaif

Next Story

Most Viewed