రేప్ సీన్‌లో రేజ్ అయిపోయా.. 'Badlapur' అనుభవాలపై Huma Qureshi

by Disha Web Desk 13 |
రేప్ సీన్‌లో రేజ్ అయిపోయా.. Badlapur అనుభవాలపై Huma Qureshi
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హ్యూమా ఖురేషి 'బద్లాపూర్' లో రేప్ సీన్ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఇందులో సెక్స్ వర్కర్‌గా కనిపించిన ఆమె.. అలాంటి వారి పట్ల చెడు భావనతో ఉండకూడదనే మెసేజ్ ఇవ్వాలనే ఆ క్యారెక్టర్ ప్లే చేసినట్లు తెలిపింది. జీవితంలో ఎన్నో సార్లు రేప్ చేయబడుతున్న సెక్స్ వర్కర్స్‌ను జడ్జ్ చేయడం సరికాదని, వాళ్లు స్త్రీలేనని చెప్పాలనుకున్నట్లు వివరించింది. అయితే ఈ సినిమాలో విలన్‌పై రివేంజ్ తీసుకునేందుకు.. ఆయన గర్ల్ ఫ్రెండ్ అయిన తనను హీరో రేప్ చేసే సీన్ ఉంటుందని చెప్పింది. ఆ సన్నివేశం చేస్తున్నప్పుడు కోపంతో ఊగిపోయానని, అతన్ని కొట్టాలనిపించినా కొట్టలేని పరిస్థితి అని తెలిపింది. సీన్ కంప్లీట్ అయ్యాక.. ఇంటికి వెళ్లినా సరే ఆగ్రహంతో చేతులు షేక్ అయ్యేవని తెలిపింది హ్యూమా.

Next Story

Most Viewed