భారీ గుడ్ న్యూస్.. ‘కార్తికేయ-3’ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరో నిఖిల్

by Disha Web Desk 6 |
భారీ గుడ్ న్యూస్.. ‘కార్తికేయ-3’ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరో నిఖిల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో, కలర్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తీకేయ. దీనికి చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా 2014 లో విడుదలై భారీ విజయం అందుకుంది. అలాగే 2022లో నిఖిల్- అనుపమ కాంబోలో వచ్చిన కార్తికేయ-2 కూడా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా భారీగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నిఖిల్ కార్తికేయ-3 కూడా ఉంటుందని ప్రకటించాడు. కానీ దీనికి సంబంధించిన విషయాలు పోస్టర్స్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, నిఖిల్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. డాక్టర్ కార్తికేయ తొందరలో సరికొత్త సాహసం స్టార్ చేయబోతున్నాడు అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్టును చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, డైరెక్టర్ చందూ మొండేటి నాగచైతన్య తండేల్ చిత్రం షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోగానే కార్తికేయ-3 స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

Read More..

ప్రభాస్ ‘కల్కి 2898ఎడి’ విడుదలకి సేఫ్ సైడ్ ప్లాన్..?

Next Story

Most Viewed