Samantha: సమంత అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా ‘మా ఇంటి బంగారం’

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం అయింది.

Samantha: సమంత అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా ‘మా ఇంటి బంగారం’
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం అయింది. ‘ఖుషీ’ మూవీ తర్వాత నుంచి పూర్తిగా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సామ్ ఇటీవల నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై తన మొదటి ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘శుభం’ (shubham)మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనిపించి సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. ‘20 హెల్త్’ అనే ప్యాడ్‌కాస్ట్ పేరుతో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది.

ఇండస్ట్రీకి దూరం అయినప్పటి నుంచి అభిమానులు మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుతుండటంతో ‘మా ఇంటి బంగారం’ (ma inti bangaram)చిత్రాన్ని ప్రకటించింది. దీంతో అంతా సంతోషపడ్డారు. ఆ తర్వాత గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు పెంచేసింది. సమంత, నందిని రెడ్డి(Nandini Reddy) కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని ట్రాలాలా పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. అప్డేట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ మూవీని మొత్తానికి పక్కకు పెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ పోస్ట్ సమంత అభిమానుల ఆనందానికి కారణమవుతోంది. గత ఏడాది సమంత బర్త్ డే కానుకగా వచ్చిన ‘మా ఇంటి బంగారం’ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.

link

Next Story