- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ మూవీ డబుల్ అప్డేట్స్‌కు ముహూర్తం ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, యోగిబాబు, సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రభాస్ అభిమానులు ‘ది రాజాసాబ్’ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ రాబోతున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 1వ తేదీన ట్రైలర్ రాబోతుండగా.. డార్లింగ్ బర్త్ డే నాడు అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






