- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ‘బోర్డర్-2’ నుంచి డబుల్ అప్డేట్ విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మేధా రానా(Medha Rana), మోనా సింగ్, సోనమ్ బజ్వా హీరోయిన్లుగా నటిస్తుండగా.. దిల్జిత్ దోశాంజ్, నీతీష్ నిర్మల్, ఆహాన్ శెట్టి, వినాలి భట్నాగర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘బోర్డర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని జెపి ఫిల్మ్స్, టి సిరిస్ బ్యానర్స్‌పై భూషన్ కుమార్(Bhushan Kumar), క్రిషన్ కుమార్ జెపి దత్తా, నిధి దత్తా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనిని 1999లో కార్గిల్ యుద్ధం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డబుల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచ సన్నీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో సన్నీ డియోల్ గన్ పట్టుకుని యుద్ధం చేస్తూ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. పక్కనే జాతీయ జెండా కింద పడుతుండగా.. కొందరు నిల్చొబెడుతుండగా.. మంటలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ మూవీపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ పోస్టర్‌తో పాటు ఈ సినిమా ఒకరోజు ముందుగా.. జనవరి 22న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.






