మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. బర్త్ డే ట్రీట్‌గా ‘సంబరాల ఏటిగట్టు’ అప్డేట్

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), రోహిత్ కెపి(Rohit KP) కాంబోలో ‘సంబరాల ఏటిగట్టు’ (SambaralaYetiGattu)రాబోతున్న విషయం తెలిసిందే.

మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. బర్త్ డే ట్రీట్‌గా ‘సంబరాల ఏటిగట్టు’ అప్డేట్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), రోహిత్ కెపి(Rohit KP) కాంబోలో ‘సంబరాల ఏటిగట్టు’ (SambaralaYetiGattu)రాబోతున్న విషయం తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కానుకగా.. స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. ఈ వేడుక అక్టోబర్ 15న ప్రసాద్ PCX స్క్రీన్‌‌లో ఉదయం 10గంటలకు జరగనుంది. ‘‘గాలిలో గుసగుసలాట.. ఆత్మలో ఒక తుఫాన్.. అసుర ఆగమన గ్లింప్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story