మెగా అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. విజయదశమి నాడు ‘పెద్ది’ నుంచి బిగ్ అప్డేట్!

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi).

మెగా అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. విజయదశమి నాడు ‘పెద్ది’ నుంచి బిగ్ అప్డేట్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi). స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వ్రిద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ(Divyendu Sharma), శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసేందుకు మూవీ మేకర్స్ పక్కా ప్రణాళికతో పలు ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. దీంతో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ మెగా అభిమానులను సంతోషానికి గురి చేస్తోంది. అక్టోబర్ 2న విజయదశమి కానుకగా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సూపర్ ఎక్జైటెడ్.. మాకు కావాల్సింది కూడా అదేనంటూ ఎగిరి గంతేస్తున్నారు.

Next Story