- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధృవ్ విక్రమ్ పేరుతో భారీ మోసం.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన హీరో
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి భారీ మోసాలు జరుగుతున్నాయి.

దిశ, సినిమా: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి భారీ మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వరకు మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు సెలబ్రిటీలకు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వారి ఫొటోలను ఏఐ ద్వారా ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సమస్యల్లో చిరంజీవీ, తమన్నా, రష్మిక మందన్నా వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కోర్టుకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో యంగ్ హీరోకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కోలీవుడ్ స్టార్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) పేరుతో పలువురు భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
అలాగే అమాయకపు ప్రజల నుంచి డబ్బులు కూడా లాగేస్తున్నారు. ఈ విషయంపై ధృవ్ విక్రమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నా ప్రమేయం లేకుండా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి నా ఫొటోలను అలాగే ఏఐ జనరేటర్ వాయిస్ ఉపయోగిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారు. మీడియా, ప్రెస్, ఫ్రెండ్స్ అలాగే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. అది కూడా Dhruv Vikram పేరుతో ఉంటుంది. అంతేకానీ ఫేస్ బుక్, ట్విట్టర్, స్నాప్ చాట్ వంటి ఇతర ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లేవు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇలాంటి మోసాల నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందే. అంతేకాకుండా ఏదైనా కొత్తగా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడిస్తాను’’అని అభిమానులను అలర్ట్ చేశారు. కాగా.. ఇటీవల ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)కాంబోలో వచ్చిన మూవీ ‘బైసన్’. ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ సినీ ప్రియులను సైతం మెప్పిస్తుంది.






