‘కాంతారా: చాప్టర్1’ సెట్‌లో భారీ ప్రమాదం.. కంగారులో ఫ్యాన్స్.. నిర్మాత రియాక్షన్ ఇదే!

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్వకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1).

‘కాంతారా: చాప్టర్1’ సెట్‌లో భారీ ప్రమాదం.. కంగారులో ఫ్యాన్స్.. నిర్మాత రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్వకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1). అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెట్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇటీవల రిషబ్ శెట్టికి కూడా ప్రమాదం జరగాల్సి ఉండగా.. అలర్ట్ అయిన టీమ్ కాపాడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో రిషబ్ శెట్టికి ఏమైనా జరిగిందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

తాజాగా, ఈ విషయంపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ (Adarsh)స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఆ వార్తల్లో నిజం లేదు. షూటింగ్ జరుగుతున్న జలాశయం వల్ల మేము ఒక సెట్ వేశాం. గాలి వల్ల అది పాడైపోయింది. కానీ ఈ ఘటన జరిగినప్పుడు సెట్‌లో ఎవరూ లేరు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలో షూట్ జరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు.

Next Story