- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్ రోషన్..ఫోటోస్ వైరల్..
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొణే కథానాయికగా కనిపించనున్నారు. ఈ హీరో భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఏ కార్యక్రమానికైనా ఈ జంట కలిసి వెళ్లడం వల్ల, అలాగే గతేడాది డిన్నర్ డేట్‌లో కనిపించిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. వీరు ముంబయిలో సుమారు 100 కోట్ల రూపాయలతో రెండు ప్లాట్లను కొన్నట్లు సమాచారం. అయితే తాజాగా.. ముంబయిలో ఓ ఇవెంట్‌లో జంట పాల్గొన్నారు. అక్కడ అమిత్ , సబా ఫోటోలు ఫోజులిస్తుండగా... హృతిక్ వెనకాల హిల్స్ పట్టుకుని కనిపించాడు. ఆ ఫోటోలోను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అది చూసి ఈ నటుడి ఫ్యాన్స్.. కొందరూ ‘ప్రేమికురాలు అంటే ఎంత ఇష్టమోనని, మరికొందరు హృతిక్ అలా చేయడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






