- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఇన్‌స్పైర్ చేసింది: Hrithik Roshan
దిశ, సినిమా : 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఫ్రాంచైజీ తన బ్లాక్ బస్టర్ మూవీ 'క్రిష్'కు స్ఫూర్తి అని తెలిపాడు హృతిక్ రోషన్.

X
దిశ, సినిమా : 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఫ్రాంచైజీ తన బ్లాక్ బస్టర్ మూవీ 'క్రిష్'కు స్ఫూర్తి అని తెలిపాడు హృతిక్ రోషన్. 1954లో జే.ఆర్.ఆర్ టోల్కీన్ రచించిన ఈ ఓల్డ్ హై ఫాంటసీ నవల ఆధారంగా 'క్రిష్' సిరీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం 'క్రిష్ 4' కోసం సిద్ధమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన హీరో.. ఈ నవలపై ప్రశంసలు కురిపించాడు. అలాగే 2003లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'కోయి మిల్ గయా' తర్వాత అంతగా అనుబంధం ఏర్పరుచుకున్న చిత్రం 'క్రిష్' అని తెలిపాడు. ఇక తన తండ్రి రాకేష్ రోషన్ 2004లో మొదటిసారి 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' ఫస్ట్ పార్ట్ చూసి వెంటనే రెండవ భాగం కావాలని అడిగాడని, అది చూసే వరకూ ఆయన నిద్రపోలేదంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చివరగా ఈ 'క్రిష్' సీక్వెల్‌లో భాగం కాబోతున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు హృతిక్.
Next Story






