- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’ వీఎఫ్ఎక్స్ రచ్చపై హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు!
కథకు ఏ విధమైన వీఎఫ్ఎక్స్ స్టైల్ వాడాలనేది పూర్తిగా ఆ చిత్రబృందం నిర్ణయం. మనకు నచ్చిన విధంగా విజువల్స్ లేనంత మాత్రాన.. వారి కష్టాన్ని తక్కువ చేసి చూడటం, వర్క్ బాలేదని విమర్శించడం ఏమాత్రం సరికాదు.

దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్ హీరోగా, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రామ గ్లింప్స్ విడుదలవ్వగా, సోషల్ మీడియాలో విజువల్స్, వీఎఫ్ఎక్స్ స్టైల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విమర్శలు గుప్పిస్తుండటంతో, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. సినిమా టీమ్‌ను వెనకేసుకొస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "కల్కి, బాహుబలి, రామాయణ, కోయి మిల్ గయా, క్రిష్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకులే నా నిజమైన హీరోలు.
మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజువల్ వండర్స్‌ను ప్రేక్షకులకు అందించాలనే ధైర్యం, దార్శనికత వారిలో ఉంది. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు వారు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్‌ను రిస్క్ చేసి, ఏళ్ల తరబడి కష్టపడుతున్న వారి ఆలోచనలను మనం గౌరవించాలి" అని పేర్కొన్నారు. ఇక ‘రామాయణ’ వీఎఫ్ఎక్స్ స్టైల్‌పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ గురించి హృతిక్ ఘాటుగానే స్పందించారు. "తమ కథకు ఏ విధమైన వీఎఫ్ఎక్స్ స్టైల్ వాడాలనేది పూర్తిగా ఆ చిత్రబృందం నిర్ణయం. మనకు నచ్చిన విధంగా విజువల్స్ లేనంత మాత్రాన.. వారి కష్టాన్ని తక్కువ చేసి చూడటం, వర్క్ బాలేదని విమర్శించడం ఏమాత్రం సరికాదు. ప్రతి సినిమాకు ఒక విజన్ ఉంటుంది. పూర్తి సినిమా చూడకుండా కేవలం ఒక గ్లింప్స్ ఆధారంగా నిర్ణయానికి రావొద్దు" అని హృతిక్ కోరారు.






