- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలరోజులకే ఓటీటీలోకి వస్తున్న ‘హృదయ పూర్వం’.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal)వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal)వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన ‘హృదయం పూర్వం’ (hrudaya purvam)చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. సత్యం అంతికడ్ (Sathyan Anthikad)దర్శకత్వం వహించగా.. తన సొంత నిర్మాణ సంస్థ అశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరుంబావూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ మూవీలో సంగీత్ ప్రతాప్, సంగీత్, సిద్ధిఖీ, నిషాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా నెలరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. తాజాగా, ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 26 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






