" Lucky Laxman " టీజర్ ఎలా ఉందంటే !

by Disha Web Desk 10 |
 Lucky Laxman  టీజర్ ఎలా ఉందంటే !
X

దిశ, వెబ్ డెస్క్ : సయ్య‌ద్ సోహైల్‌‌ను బుల్లి తెర ప్రేక్షకులను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వచ్చిన సినిమా ఆఫర్లను అందిపుచ్చుకొని హీరోగా మన ముందుకు వచ్చాడు. సోహైల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా " లక్కీ లక్ష్మణ్ ". ఈ సినిమాకు ఎ.ఆర్.అభి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోహైల్ సరసన మోక్ష హీరోయిన్‌గా నటిస్తుంది.ద‌త్తాత్రేయ మీడియా ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ 30 న విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసిన సమాచారం. తాజాగా నిన్న ఈ సినిమా నుంచి టీజర్ ను విడదల చేసారు.టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.



Next Story