- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెన్స్ స్టార్ట్.. ‘హాట్‌స్పాట్–2’ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దర్శకుడు విగ్నేష్ కార్తీక్(Vignesh Karthik) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ ‘హాట్‌స్పాట్ – 2 మచ్ (Hotspot – Too Much)’ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

దిశ, సినిమా: దర్శకుడు విగ్నేష్ కార్తీక్(Vignesh Karthik) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ ‘హాట్‌స్పాట్ – 2 మచ్ (Hotspot – Too Much)’ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హాట్‌స్పాట్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, కథా పరంగా మరింత డార్క్, ఇంటెన్స్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనుందని మేకర్స్ చెబుతున్నారు. మొదటి భాగాన్ని మించిన ట్విస్టులు, షాకింగ్ మోమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమె పాత్ర కథను ముందుకు నడిపించే విధంగా ఉండబోతుందని సమాచారం. అలాగే అనుభవజ్ఞుడైన నటుడు తంబి రామయ్య, యంగ్ టాలెంట్ అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, రంజన తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పణలో కే.జే. బాలమణిమార్చన్ నిర్మిస్తున్నారు.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పేరున్న ఈ బ్యానర్ నుంచి వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచింది. డార్క్ టోన్, ఇంటెన్స్ విజువల్స్‌తో రూపొందిన ఆ లుక్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా, మేకర్స్ మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ జనవరి 1 ఉదయం 11:30 గంటలకు విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. న్యూ ఇయర్ కానుకగా రాబోతున్న ఈ టీజర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉండబోతుందని, కథలోని మిస్టరీ ఎలిమెంట్స్‌కు సంబంధించిన హింట్స్ ఇందులో కనిపిస్తాయని చిత్రబృందం వెల్లడించింది.






