- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడివి శేష్‌తో చిందులేయనున్న హాట్ బ్యూటీ.. ‘డెకాయిట్’ సెకండ్ సింగిల్ అప్డేట్‌తో సోషల్ మీడియా షేక్
అడివి శేష్ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ‘డెకాయిట్’ మాస్ సాంగ్ రాబోతున్నట్లు ప్రకటించి సోషల్ మీడియాను షేక్ చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. మూవీ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ‘డెకాయిట్’ మాస్ సాంగ్ రాబోతున్నట్లు ప్రకటించి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ సినిమాలో ఒక మాస్ నంబర్ కోసం పాపులర్ సింగర్ జోనితా గాంధీని రప్పించినట్లు తెలిపాడు. తన మధురమైన గొంతుతో పాటలు పాడే జోనితా గాంధీ, ఈ ‘డెకాయిట్’ మూవీలో అడివి శేష్‌తో కలిసి ‘చిచ్చుబుడ్డి’ అనే మాస్ సాంగ్‌లో స్క్రీన్ పంచుకోబోతోంది. ఇండో-కెనడియన్ సింగర్ అయిన జోనితాకు సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘అరబిక్ కుత్తు’ (హలమితీ హబీబో) పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు నేరుగా వెండితెరపై అడివి శేష్‌తో పోటీపడి డ్యాన్స్ చేయబోతుండటం విశేషం.
జోనితా, తన గ్లామర్,ఎనర్జిటిక్ స్టెప్పులతో ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లనుంది. దర్శకుడు షానీల్ డియో ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటను మార్చి 28న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. అడివి శేష్ లాంటి పెర్ఫెక్ట్ యాక్టర్ పక్కన జోనితా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ , మొదటి పాటకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండో పాటతో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అడివి శేష్ మార్క్ యాక్షన్, మృణాల్ ఠాకూర్ లవ్ ట్రాక్ ,జోనితా గాంధీ మాస్ సాంగ్.. ఇలా అన్ని కలగలిపిన చిత్రంగా ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.






