- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. డబుల్ ధమాకా ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri).

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్స్ భారీగా రాబట్టి దుమ్మురేపింది. పలు ప్రశంసలు కూడా పొందింది. ‘కిష్కింధపురి’ హిట్‌గా నిలిచినప్పటికీ నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.
తాజాగా, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు తెలుపుతూ.. ప్రముఖ సంస్థ డబుల్ ధమాకా ఇస్తూ.. అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకరోజు గ్యాప్‌తో టీవీల్లోకి కూడా రాబోతున్నట్లు తెలిపారు. ‘కిష్కింధ పురి’ చిత్రం హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. అంతేకాకుండా అక్టోబర్ 19న సాయంత్రం జీ టీవీలో ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఓటీటీ ఢీల్ భారీ ధరకు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్‌కు.. ‘‘భయం..మిమ్మల్ని చూసి మీలోని భయాన్ని కనుగొంటుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.






