- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్-అట్లీ ‘AA-22’ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ స్టార్.. అంచనాలు పెంచుతున్న ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘AA-22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ పనిచేస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone)హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా ముంబైలో ప్రారంభం కాబోతున్నట్లు టాక్. దీనిని సైన్స్‌ఫిక్షన్ సినిమాగా తీసుకురాబోతున్నారు. ఇక ఈ చిత్రం అధికారిక ప్రకటన విడుదలైనప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక సినీ ప్రియులు, సెలబ్రిటీలు సైతం ‘AA-22’ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ విల్‌స్మిత్(Willsmith) విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. అలాగే హార్దిక్ పాండ్యా, అమెరికా నటుడు డ్వేన్ డగ్లస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ న్యూస్ నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్‌నేషనల్ వరకు రీచ్ కావడంత ఖాయం అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక విల్‌స్మిత్ విషయానికొస్తే.. ఆయన గతంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీలో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విలన్‌గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.






