- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి జత కట్టబోతున్న హిట్ జోడీ.. మూవీ అప్డేట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మూవీ మేకర్స్
టాలీవుడ్ నటుడు హర్ష రోషన్(Harsha Roshan) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు హర్ష రోషన్(Harsha Roshan) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది నాని నిర్మాణంలో వచ్చిన ‘కోర్టు’ సినిమాతో హీరోగా మారాడు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ లీగల్ డ్రామాలో కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర కీలక పాత్రలో కనిపించారు. ఇది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా ఘన విజయం సాధించి అందరి ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు హర్ష రోషన్, శ్రీదేవి(Sridevi) కాంబోలో మరో మూవీ రాబోతుంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ హర్ష సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ (BandMelam)టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్‌కు ‘‘మొదటి బీట్‌ను మీ అందరికీ అందిస్తున్నాము. ఇది హృదయానికి దగ్గరగా ఉంటుంది. మీరు మాతో కలిసి దీన్ని అనుభవించే వరకు నేను వేచి ఉండలేను’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక విడుదలైన గ్లింప్స్ విషయానికొస్తే.. చేనుకాడ ఉందో జాజిమొగులాలి.. బాయికాడ ఉందో జాజిమొగులాల అని పాటతో స్టార్ట్ అవగా.. రాజమ్మ అని పిలుస్తూ హర్ష రోషన్ ఇళ్లంతా వెతుకుతాడు.
మేడపై శ్రీదేవి పూల మొక్కలు కట్ చేస్తూ కనిపిస్తుంది. ఇక హర్ష రాజమ్మ అని పిలవడంతో కోపంగా.. గునపంతో గుద్దుతా బావ్ బాడకావ్ అని మాస్ డైలాగ్స్‌తో లంగా ఓణీలో శ్రీదేవి ఎంట్రీ అదిరిపోయింది. ఇక హర్ష కొత్త ట్యూన్ రెడీ చేసినా.. యాదగిరి ఇక్కడ వాయిస్తే భువనగిరి వరకు వినిపిస్తది అని అనడంతో గ్లింప్స్ ముగుస్తుంది. అయితే ఈ సినిమాను కేఎఫ్‌సీ బ్యానర్‌పై కోన వెంకట్ నిర్మిస్తున్నారు. చంద్రబోస్ సంగీతం అందిస్తుండగా.. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రతి బీట్‌కి ఒక ఎమోషన్ ఉంటుందన్న కాన్సెప్ట్‌తో రాబోతుంది.






