బాలయ్య బర్త్ డే కానుకగా హిట్ మూవీ రీరిలీజ్.. అప్డేట్ ఇచ్చిన టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-01 11:18:11  IST  )

గత కొద్ది రోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంది.

బాలయ్య బర్త్ డే కానుకగా హిట్ మూవీ రీరిలీజ్.. అప్డేట్ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే గతంలో ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా రీరిలీజ్‌లో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలను మూవీ మేకర్స్ మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. నిత్యం పలు చిత్రాలు రీరిలీజ్ అవుతూ ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ థియేటర్స్‌కు వచ్చి ఆల్ టమ్ రికార్డ్‌తో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలోనే.. నందమూరి బాలకృష్ణ(Balakrishna), ఆసిన్ జంటగా నటించిన మూవీ ‘లక్ష్మీ నరసింహ’(Lakshmi Narasimha) మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. జూన్ 8న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ మూవీ 2000లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన బాలయ్య మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

Next Story