మరోసారి హిట్ కాంబో రిపీట్.. నాని సరసన జూలియట్‌గా క్రేజీ హీరోయిన్ ఫిక్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-08 02:36:20  IST  )

నేచురల్ స్టార్ నాని(nani) ఇటీవల ‘హిట్-3’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీ బిజీ అయిపోయాడు.

మరోసారి హిట్ కాంబో రిపీట్.. నాని సరసన జూలియట్‌గా క్రేజీ హీరోయిన్ ఫిక్స్!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘హిట్-3’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 26న ఏకంగా 8 భాషల్లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల దసరా పండుగ సందర్భంగా నాని ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

విజయదశమి నాడే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అభిమానులకు సర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘బ్లడీ రొమియో’ టైటిల్‌తో రాబోతుంది. ఇక త్వరలోనే రెగులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘బ్లడీ రోమియో’ కు జూలియేట్ దొరికేసినట్లు సమాచారం.

నాని రొమియోగా కనిపించనుండగా.. ఆయన సరసన రొమాన్స్ చేసేందుకు ‘ఓజీ’లో కన్మనిగా చేసి మెప్పించిన యంగ్ హీరోయిన్ ప్రియాంకను సుజిత్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో నటించేందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు టాక్. ఈ భామ త్వరలోనే షూటింగ్‌లోనూ పాల్గొనబోతోందట. కాగా, ఇప్పటికే నాని, ప్రియాంక మోహన్ కాంబోలో వచ్చిన గ్యాంగ్, లీడర్, సరిపోదా శనివారం వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలు ఘన విజయం అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో.. సినీ ప్రియుల్లో అంచనాలు భారీ పెరిగిపోయాయి.

Next Story