మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా(పోస్ట్)

by Gugulothu.Kavitha |

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రజెంట్ ‘ఎన్‌సి-24’(NC-24) అనే మూవీతో బిజీగా ఉన్నాడు.

మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రజెంట్ ‘ఎన్‌సి-24’(NC-24) అనే మూవీతో బిజీగా ఉన్నాడు. కార్తీక్‌ దండు(Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు అక్కినేని హీరో మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. తన కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న చిత్రానికి హిట్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగా.. దర్శకుడు ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై పని చేస్తున్నాడు. ఫీల్-గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కాగా నాగ చైతన్య- శివ నిర్వాణ కాంబోలో ‘మజిలీ’(Majili) మూవీ వచ్చి ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి రాబోతున్న ‘ఎన్‌సి-25’(NC-25)పై ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌కు క్యూరియాసిటీ నెలకొన్నది. Link

Next Story