హిట్ కాంబో రిపీట్.. మహారాణి మా ‘NBK-111’ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

హిట్ కాంబో రిపీట్.. మహారాణి మా ‘NBK-111’ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా, నయనతార మరో బిగ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్లు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. బాలకృష్ణ(Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni)కాంబోలో రాబోతున్న ‘NBK-111’లో హీరోయిన్‌గా ఫైనల్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ వీడియోను షేర్ చేసింది. నేడు నయనతార పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ ‘NBK-111’లో మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు ట్విట్టర్ ద్వారా గోపీచంద్ మలినేని వెల్లడించారు. ‘‘సముద్రమంత, ప్రశాంతతను, తుపాను, అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామాజ్యంలోకి అడుగుపెట్టనుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే గుర్రపై వెళ్తున్న వీడియోను షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డెట్స్ రాబోతున్నాయని తెలిపారు. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు అనౌన్స్ చేయడంతో బాలయ్య అభిమానులు ఆనంద పడుతున్నారు. వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే నయతార, బాలయ్య కాంబోలో మూడు చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇది వీని నాలుగో సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరూ సింహా,జైసింహా, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తమ కెమిస్ట్రీతో మంత్రముగ్దులను చేశారు. ఇక ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

LINK

Next Story