హిట్ కాంబో రిపీట్.. డబుల్ ధమాకా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంకండి!..

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ గత కొద్ది కాలంగా ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒక్క హిట్ కూడా పడటం లేదు.

హిట్ కాంబో రిపీట్.. డబుల్ ధమాకా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంకండి!..
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ గత కొద్ది కాలంగా ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒక్క హిట్ కూడా పడటం లేదు. ఈక్రమంలోనే రవితేజ, శ్రీలీల(Sreeleela) కాంబోలో వచ్చిన ‘ధమాకా’ (dhamaka)సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి రవితేజ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా ప్రేక్షకులను మనసులు గెలుచుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు సాంగ్, మ్యూజిక్, కామెడీ, రవితేజ శ్రీలీల మాస్ డ్యాన్స్ ప్లస్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ధమాకా సీక్వెల్‌కు ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్‌ని కూడా ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించిందని సమాచారం. త్రినాథరావు నక్కిన చేసిన ‘మజాకా’ సినిమా ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆయన ‘డబుల్ ధమాకా’ స్క్రిప్ట్ పనుల్లో భాగంగా రచయిత ప్రసన్న కుమార్‌తో కలసి వర్క్ చేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రవితేజ, శ్రీలీల మరోసారి రచ్చ చేస్తారిన డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

కాగా.. రవితేజ సినిమాల విషయానికొస్తే.. త్వరలో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోరు తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలోఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంతో పాటు రవితే శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story