- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనతో నన్ను పోల్చవద్దు.. ఆ స్థాయికి నేను చేరుకోలేను
సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనంపై ఆయన మనవడు కళ్యాణ్ రామ్ ప్రశంసలు కురిపించాడు.

దిశ, సినిమా : సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనంపై ఆయన మనవడు కళ్యాణ్ రామ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు తాతలాంటి వారితో తనను ఎప్పటికీ పోల్చవద్దని, ఆయన స్థాయిని తాను చేరకోలేనన్నాడు. శ్రీకళాసుధ తెలుగు సోషియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం చెన్నైలో వైభవంగా జరిగింది. కాగా తదితరులు ప్రముఖులతోపాటు ఈ వేడుకకు హాజరైన కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ సినిమాకుగానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అయితే కొంతమంది మా వారసత్వానికి సంబంధించి పలు చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా తాత నందమూరీ తారకరామారావుగారితో నన్ను పోల్చడం ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన స్థాయికి నేను చేరుకోలేను. దయచేసిన ఎవరూ ఈ పోలిక తీసుకురావొద్దని కోరుకుంటున్నా’ అన్నాడు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్, పి. సుశీల, రవి శంకర్, మువ్వా పద్మయ్య, అలి, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
Read more:






