- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RGV వ్యూహం సినిమాపై నేడు హైకోర్టు తీర్పు.. అందరిలో ఉత్కంఠ
by GSrikanth |
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహాం’ సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహాం’ సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది. ఈ నెల 29వ తేదీన చిత్రం విడుదల ఉండటంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇక, ఇంతకుముందే విడుదలకు వారం రోజులు ఉందనగా రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది.
Next Story






