‘హే భగవాన్’ ఆడియన్స్‌ ఊహకు అందని విధంగా ఉంటుంది: బి.నరేంద్ర రెడ్డి

by Mallepaka Hamsa |

‘హే భగవాన్‌’లోని ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను హత్తుకుంటుంది.

‘హే భగవాన్’ ఆడియన్స్‌ ఊహకు అందని విధంగా ఉంటుంది:  బి.నరేంద్ర రెడ్డి
X

దిశ, సినిమా: ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’(Hey Bhagavan) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్(Suhas), శివానీ నగరం(Shivani Nagaram), సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచార్య(Gopi Acharya) దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి(Narendra Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంతా క్వాలిటీగా అవుట్‌పుట్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్‌ అయ్యానో రేపు.. ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్ల్‌ ఫీలవుతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో హీరో సుహాస్‌, నటుడు నరేష్‌, కమెడియన్ సుదర్శన్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి పాత్ర ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఖచ్చితంగా ఆడియన్స్‌ ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది.

Next Story