హీరోయిన్ల జీవనశైలి చాలా ఖరీదైనది.. నిధి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-24 11:46:10  IST  )

సాధారణంగా ప్రేక్షకులు వెండితెరపై హీరోయిన్ల గ్లామర్‌ను చూసి మురిసిపోతుంటారు, కానీ ఆ గ్లామర్‌ను కాపాడుకోవడానికి పడే కష్టం, ఖర్చు వేరే స్థాయిలో ఉంటాయని నిధి వివరించింది.

హీరోయిన్ల జీవనశైలి చాలా ఖరీదైనది.. నిధి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఒక సరైన బ్రేక్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ హిట్ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నా, బాక్సాఫీస్ వద్ద అవి ఫ్లాపులుగా మిగిలిపోతుండటంతో నిధికి అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇటీవల ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ , పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీర మల్లు’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల కోసం ఆమె ఎంతో కష్టపడింది. అయితే, ఈ ప్రాజెక్టుల ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో కెరీర్ స్లో అవ్వడంతో ఆమె ప్రస్తుతం కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి, ఒక హీరోయిన్ మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది. సాధారణంగా ప్రేక్షకులు వెండితెరపై హీరోయిన్ల గ్లామర్‌ను చూసి మురిసిపోతుంటారు, కానీ ఆ గ్లామర్‌ను కాపాడుకోవడానికి పడే కష్టం, ఖర్చు వేరే స్థాయిలో ఉంటాయని నిధి వివరించింది. ఒక నటి జీవనశైలి చాలా ఖరీదైనదని, కేవలం ప్రయాణాలు, వసతి, పౌష్టికాహారం, జిమ్, పార్లర్ కోసం నెలకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. ఇక ఏదైనా సినిమా ప్రమోషన్స్ లేదా ఈవెంట్లకు వెళ్లాల్సి వస్తే, ఆ ఒక్క రోజు స్టైలింగ్, మేకప్, హెయిర్ స్టైల్, ఫోటోగ్రఫీ కోసం సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఈ స్థాయి ఖర్చులు తప్పవని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

Next Story