- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ బర్త్ డే స్పెషల్.. అల్లు- అర్జున్-అట్లీ మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’తో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించాడు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’తో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘AA-22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఐకాన్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె (Deepika Padukone)నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైనప్పటి నుంచి.. ఎన్నో వార్తలు వచ్చాయి. ఇందులో పలువురు హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్- అట్లీ మూవీకి సంబంధించిన ఓ కీలక అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు ఆగస్టు 1న అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ పోస్టర్ విడుదల కాబోతున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






