- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్లు ఆటబొమ్మలు కాదు.. మహిళలను ఇలా వాడుకోవడం చాలా తప్పు: మంచు విష్ణు
రాజకీయాల్లో పైచేయి సాధించడానికి నటీమణులను వస్తువుల లాగా వాడుకోవడం కరెక్ట్ కాదు.

దిశ, సినిమా: తమిళనాడు రాజకీయాల్లో నటీమణులను ఉద్దేశించి కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో, మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రచారాల్లో హీరోయిన్ల పేర్లను లాగడం, వారిని కించపరిచేలా మాట్లాడటం చాలా అసభ్యకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నయనతార గురించి ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విష్ణు ఈ పోస్ట్ చేశారు. "రాజకీయాల్లో పైచేయి సాధించడానికి నటీమణులను వస్తువుల లాగా వాడుకోవడం కరెక్ట్ కాదు. కేవలం తమిళనాడులోనే కాదు, ఎక్కడైనా సరే ఇది పద్ధతి కాదు. తెరపై కనిపించే నటీమణులకు కూడా వెనుక ఒక కుటుంబం ఉంటుంది, వారికి గౌరవం ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది. కేవలం వార్తల్లో నిలవడానికో లేదా ఎదుటివారిని అవమానించడానికో మహిళలను ఆటబొమ్మల లాగా వాడుకోవడం చాలా తప్పు" అని విష్ణు పేర్కొన్నారు. మహిళలను మనం ‘శక్తి’గా గౌరవిస్తామని, అలాంటి వారిని రాజకీయ చర్చల్లోకి లాగి అవమానించడం మన సంస్కృతి కాదని ఆయన గుర్తు చేశారు. ఇకనైనా రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నటీమణుల గౌరవం కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. LINK






