- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోతో హీరోయిన్ త్రిష పెళ్లి.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 40 ఏళ్లకు పైగా వయసున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంది. కానీ డేటింగ్ రూమర్స్ మాత్రం నిత్యం షికార్లు చేస్తూనే ఉంటాయి. మొన్నటి వరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay)తో డేటింగ్‌లో ఉందని, అతన్నే మ్యారేజ్ చేసుకుంటుందని కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోని పెళ్లాడబోతుందని మరో గాసిప్ వైరల్ అవుతోంది. దానికి కారణం వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటో దర్శనమివ్వడమే. వివరాల్లోకి వెళితే.
వైరల్ అవుతున్న ఫొటోలో శింబు(Shibu), త్రిషలు చాలా సన్నిహితంగా కనిపించారు. అలాగే ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వీరిద్దరు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా అలై, విన్నైతాండి వరువాయ చిత్రాల్లో కలిసి నటించిన శింబు, త్రిష.. లాక్‌డౌన్‌లో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కార్తీక్ డయల్ సైత ఎన్ అనే షార్ట్ ఫిలింలోనూ కనిపించారు. ఇక వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే.






