కష్టాల్లో హీరోయిన్ శ్రీ లీల...ఇక ఆ ఇద్దరు హీరోలే దిక్కు ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల ( SREELEELA) గురించి తెలియని వారు ఉండరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు

కష్టాల్లో హీరోయిన్ శ్రీ లీల...ఇక ఆ ఇద్దరు హీరోలే దిక్కు ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల ( SREELEELA) గురించి తెలియని వారు ఉండరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ధమాకా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళింది. ఆమె ఇప్పటి వరకు 10 సినిమాలకు పైగానే చేసింది. ఇందులో మంచి హిట్ అయినవి కొన్ని మాత్రమే ఉన్నాయి.

ధమాకా తర్వాత బాలయ్యతో చేసిన భగవంతు కేసరి సినిమాలు మాత్రమే హీరోయిన్ శ్రీ లీల ఖాతాలో హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత.. ఆది కేశవ, ఎక్సట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ పుష్ప 2 లో ఆమె చేసిన రెండు కోట్ల ఐటమ్ సాంగ్ మాత్రం అందరిని ఆకట్టుతుంది. దానికి తగ్గట్టుగానే రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది హీరోయిన్ శ్రీ లీల. అయితే అలాంటి శ్రీ లీలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. తాజాగా జూనియర్ సినిమా చేసిన కూడా హిట్ కాలేదు.

రొటీన్ సినిమాగా జనాల నుంచి రియాక్షన్ వస్తుంది. అంటే ఈ సినిమా కూడా పోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇంతటి కష్టాల్లో హీరోయిన్ శ్రీ లీల ఉండగా... ఆమెను కాపాడేది ఇద్దరే ఇద్దరు హీరోలు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందులో ఒకరు రవితేజ కాగా మరొకరు పవన్ కళ్యాణ్. రవితేజ తో మాస్ జాతర సినిమా చేస్తోంది హీరోయిన్ శ్రీ లీల. ఇప్పటికే ధమాకా సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని శ్రీలీల నమ్మకం పెట్టుకున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Next Story