- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అగ్ని నక్షత్రం'లోని 'తెలుసా తెలుసా' పాటను రిలీజ్ చేసిన సమంత
అగ్ని నక్షత్ర'లోని 'తెలుసా తెలుసా' అనే పాటను హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మంచు మోహన్‌బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఈ సినిమాకు వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా' పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ కూడా కనువిందు చేయడం విశేషం.
కాగా త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.






